ఇది నేను diary రాస్తున్న 1st day . నా మనసులోని ఎన్నో భావాలని ఇందులో share చేసుకోవాలనుకుంటున్నాను...
నేను Diary రాయాలి అని అనుకోగానే నాకు వచ్చిన మొదటి ఆలోచన, నా గురించి రాసుకోవాలని. ఇంట్లో అమ్మ, నాన్నగారు, నేను, No Siblings. ఇప్పుడు అందరితో సరదాగా ఉన్నట్టు ఉంటున్నాను కానీ లోపల ఏదో మిస్ అవుతున్న feeling . చిన్నప్పటి నుంచి ఎక్కువగా friends లేకపోవడం వలన ఏమో తెలీదు కానీ, నాకు చుట్టూ నా age group people తో సరదాగా ఉండాలని ఎంతగానో ఉండేది. చిన్నతనాన్ని చాలా miss అయ్యాను . ఎప్పుడూ అంతగా నా వయసు పిల్లతో ఆడుకోలేదు, సరదాగా గడపలేదు అని ఒక బాధ. 10th class కి వచ్చాక నాకు ఆలా ఆడుకోవాలి అని అనిపించేది కానీ అప్పటికే వయసు పెరిగిపోవడం తో అది ఒక constraint గా మారి నేను ఆలా ఉండలేక పోయాను. కానీ B.Tech కి వచ్చాక అర్ధమైంది నేను ఎం మిస్ అయ్యానో. కొత్త మనుషులుతో మాట్లాడాలంటే భయం, సిగ్గు, మొహమాటం, ఈ సమస్య నుంచి నేను తొందరగా బయట పడతానన్న నమ్మకం నాకు ఇప్పుడు కలిగింది.
ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ, ఇక్కడ నేను అనుకుంటున్న ఒక బంధం గురించి చెప్పుకోవాలి, తనే మా చెల్లి, రితిక. నేను అనుకుంటున్న అని ఎందుకు అంటున్నానంటే, నా మనసులో నేను ఆమెని చెల్లి అనే భావిస్తున్నాను, కానీ ఆమె నన్ను అన్నయ్య అని భావిస్తోందా లేక just ఒక friend లా feel అవుతోందా అనేది నాకు ఇంకా తెలీదు. కానీ నాకు మాత్రం ఆమె ఎప్పటికి నా చెల్లి అంతే. 24/04/2023 కి ముందు ఆమె నాకు కేవలం ఒక classmate, కొంచం పరిచయం ఉన్న ఒక friend అంతే. కానీ 24/04/2023 Kochi trip ఆమెతో నేను చేసిన మొదటి journey, నాలో ఆమె పట్ల ఏదో తెలియని feeling ని create చేసింది. Return వచ్చాక ఆ భావన మరింత పెరిగింది. నాకు భయం వేసింది, ఇది ప్రేమా లేక ఏంటి అని. Then I started meditating, అప్పుడు clarity వచ్చింది.10th class నుంచి నాకు ఒక చెల్లి ఉండి ఉంటే బాగుంటుంది అని అనిపించేది, కానీ ఎం చేయగలం, అది మన చేతుల్లో ఉండదు కదా, అయితే రితిక లో నాకు ఆ ఆలోచనలు మనిషి రూపం ధరించాయా అని అనిపించింది. ఆమె helping nature, ఆమె పద్ధతులు, ఆమె ఆలోచనలు, నాకు ఒక చెల్లి ఉంటే ఆమె రితిక లాగా ఉంటుందని నేను భావించాను.
ఇంకా మధ్యలో చాలా సంఘటనలు, చాలా సన్నివేశాలు. అవన్నీ ఇప్పుడు రాసే సమయం, ఓపిక రెండు లేవు. కానీ recent గా 27/15/2023 Natarajamani Sir (Nattu Sir) మాకు final year project guide గా signature చేసిన రోజు, I couldn't forget this moment. నాకు final year project అనగానే ఏ field లో వెళ్ళాలి, faculty coordinator గా ఎవరిని తీసుకోవాలి ఏమి తెలీదు. ఇలా చెప్పకూడదేమో కానీ, ఒక వేళ నేను వేరే group అయి ఉంటే నేను Nattu Sir లాంటి మంచి faculty తో project చేయగలిగేవాడిని కాదు. ఆయన మమ్మల్ని చాలా సార్లు తిప్పించుకున్నారు, మా patience ని test చేసారు, కొన్ని ఇబ్బందికరమైన questions అడిగారు, నేనైతే మన వల్ల కాదు, ఆయన మనల్ని accept చేయరు అని అనుకున్న. నేనయిఉంటే మధ్యలోనే వదిలేసే వాడిని, కానీ వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా, ఒక చిన్న పిల్ల లాగా "నాకు Nattu Sir మాత్రమే కావలి" అని రితిక పట్టుదల తో సాధించింది. ఆమె కార్య సాధకురాలు కూడా. అచ్ఛం ఒక చిన్న పిల్ల లాగ మంకు పట్టు పట్టింది. I give Complete credit to her, I said to you and I wanna write here even once again, Thank You రితిక.
నిన్న ఒక చిన్న guilt మిగిలి ఉంది. I'm Sorry రాఘవి, నువ్వు మెసేజ్ చేసింది నేను చూసాను, but I couldn't reply. నేను outing కి వెళ్ళాను అని అబద్ధం చెప్పాను, కానీ నేను నిజంగా hostel లో నే ఉన్నాను. ఏదో పనిలో పడి నీకు reply ఇవ్వడం మర్చిపోయా కానీ నాకు ఏ wrong intention లేదు. కానీ ఆ నిజాన్ని నువ్వు ఎలా receive చేసుకుంటావో నాకు తెలీదు, so I had to lie. But once again Sorry ha
రేపు 05/06/2023 Monday, Open lab ఉంది, circuit ఏమో ఎం చేయాలో కూడా అర్ధం కావటంలేదు. అసలు problem ఎక్కడ ఉంది అనేది కూడా అర్ధం కావటం లేదు,I had to debug the circuit. ఇంకా Computer Networks assignment ఉంది, ఇంకా పనులు ఉన్నాయి, time ఏమో evening 5:40 అవుతోంది. ఇంకాసేపు రాయాలని ఉన్నా పని కూడా అంతే ఉంది, may be కుదిరితే night కి కాసేపు రాస్తానేమో. లేదంటే రేపే...